ఆజీవ స్నేహం
ఆజీవ స్నేహం


ఆకాశమంత పందిరి
భూదేవంత పీట లేకపోయినా
రెండు మనస్సులు
ఒకరిని ఒకరు కోరుకుంటూ
రెండు కుటుంబాలు
భారతీయ వివాహ వ్యవస్థను గౌరవిస్తూ
సంప్రదాయాల్ని పాటిస్తూ
మూడు ముళ్ళతో
అగ్ని సాక్షిగా
సప్తపది నడిపించి
ఆజీవ స్నేహముతో
జీవితాన్ని పండించుకోమని
శతమానం భవతి అని
వేద మంత్రాలు ఆశీస్సులు తెలుపగా
ఒక్కటైన జంట
అందరి కన్నుల పంట