సుస్వరాలఝరిలో స్వరనీరాజనం
సుస్వరాలఝరిలో స్వరనీరాజనం
సుస్వరాల ఝరిలో స్వరనీరాజనం
విరిచిన కొమ్మను మలచినారీ వీణియను
పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో
ఒదిగెనమ్మా మంజుల మృదుభాషిణి శ్రీవాణి అమ్మ ఒడిలోన
జగమెల్లా ప్రణమిల్లెను మధురవాణి గీర్వాణి
పాదాంబుజములచెంత
విరిగిన వెదురుకొమ్మే విరిసెను నల్లనయ్యని చేతిలో వేణువై
రవళించెను రాగలనెన్నో మోహనమురళి
ప్రకృతినెల్లా పరవశించెను ఆ గానరసములో
మురిసి తడిసెను ఆ సుస్వరాల ఝరిలో
పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః
ఈ గానవృష్టిలో మునిగి పునీతులైన మహానుభావులెందరో
పురందరదాసు త్యాగరాయ దీక్షిత శ్యామశాస్రులెందరో
మహానుభావులందరికీ .........
సంగీతసాహిత్య సాగరసంగమంలో సామవేదసారమై ఉద్భవించిన సుధాపానగానమొనరించిన &nb
sp; గానగంధర్వులెందరో మహానుభావులందరికీ........
సుస్వరగానసుధ నాలపించి అలరించిన స్వరరాగరంజిత గానశిఖామణులెందరో.
మహానుభావులందరికీ........
మీగడ తరగలంటి బేగడ, రాగరాజభూషణం శంకరాభరణం, సుస్వరాలరాణి కళ్యాణి , మనోరంజని శివరంజని రాగలనెన్నో జనరంజనంగా ఆలపించి తరియించిన
. ఎందరో మహానుభావులందరికీ…….. స్వరనీరాజనం
ఈ జగతిని వెలసిన అన్నమయ్యలేందరో నీ పద కీర్తన సేయగా మురిసిన ముగ్దమనోహరమోహనకృష్ణ నిన్ను నేనేమని పొగడదెనో
పొడగంటిమయ్యా నిన్నుపురుషోత్తమా నిన్నునేనేమని వేడెదనో
అమృతవర్షిణి రాగాన్నేనాలపించ నీ కరుణవృష్టికురిపించవా పరంధామా హరీ హరికాంభోజీ కీర్తించనా నీ పాదాంగదములచెంత
అనంత చరణ పాత్రుడను సేయవా
ఈశశిధరుని పాలించగరావా
మోక్షప్రదాయకా ప్రాణబంధువా
******💐💐💐*******