చెలికత్తెల చురక(త్తు)లు
చెలికత్తెల చురక(త్తు)లు
శౌరి మురారి మదియదలలో ఇళతో కూడి శృంగార సరాగాల వేళ
తనను మరులుగొన్నాడని మదనవిహారియైన రాధిక
మురారిని దండింప తలంపు చోద్యము కాదటే ?
మురారి మునిపంట ఇళ స్తనపంట నాస్వాదించి
శృంగారరసకేళిలో సరసజాక్షి పుష్పపరాగాన్ని మరిగిన మదనగోపాలుడు
తన్ను మరచినాడని రోధించిన వయ్యారి వగలమారి రాధికను కన్న
ఆ పరమశివుని వైరి మనోహరికి పతి పై పంతము కలుగదటే ?
చెరి తనువులు
మరిమరి కూడి శృంగార సరససల్లాపాల వ్యాహ్యాళిలో అలసిసొలసిన ఆ మదన మోహనుణ్ణి తన అంతరంగమునన్ కని భంగపడ్డ భామ విరహహరిణి
రాధికా మనోహరిని స్వాంతన పరిచే యతిరాజునికి యతిప్రాసలన్నీ గతితప్పగా
ఈ గోపికాలోలుని గోపాలబాలుని చిలక పలుకులు చెలి చిత్తము చెరచునటే?
ముద్దుపళని స్వాంతనము కన్నా ముద్దుగా వుండునటే ?
ఈ శశిధరుని షష్టపదులు ఆ జయదేవుని అష్టపదులపై తిష్ట వేయగలవటే?
*****💐💐💐*****