పుష్పవిలాసం
పుష్పవిలాసం


తెలతెలవారక ముందే వికసించినపూల గుసగుసలు గుసగుసలాడే పూలకి భాషలెన్నోచిరుగాలికి తలలూపే పూలకి భావాలెన్నో
ఎంత తొందరలే ఈ పూలకు పొద్దుపొడవక ముందే ప్రకృతికాంతపురుషుని పాదాల చెంత చేరాలని
ప్రభాకరుని ప్రాభవానికి ప్రభలు కోల్పొనక ముందే
తన పరిమళాన్ని పంచాలని
ఎంత తొందరలే ఈ పూలకు ప్రకృతిని పరవశింపజేయాలని
తోటలోని పూలన్నీ సప్తవర్ణాల ఇంద్రధనస్సులా
పురివిప్పి నాట్యమాడే మయూరాల్లా
శ్రీ రంగనాథుణ్ణి సేవింప గోపికాస్త్రీలతో కలిసి సప్తవన్నెల చీరలు కట్టి
గుంపుగా బయలుదేరిన రంగనాయకిలా
ఎంత తొందరలే ఈ పూలకు సేవింప శ్రీ రంగనాథుని కాళ సాలి హస్తి ల కన్నా ముందుగా భక్తితో
శివుని మేడలో వాలిపోవాలని ఎంత తొందరలే ఈ పూలకు శివపూజకు
మనిషి కన్నా మిన్నగా స్వార్ధచింతనలేక ప్రాణకోటికి
చక్కనైన చంపకకదళీ, నారికేళి, చక్కరకేళీ లందించాలని
ఎంత తొందరలే ఈ పూలకు పరసేవకు
మల్లెలు మందారాలు తన మధువుతో శివునర్చించ మధుధారలన్గ్రోల మధుపమ్ములన్ రారమ్మని మురిపించే
పుష్పరాజానికెంత తొందరలే శశిధరునిపూజకు శివుని మెడలోని పూలమాలకు వినమ్రముగా చేతులెత్తి ప్రార్ధింతు
నాబదులుగా విన్నవించమని విరించిని మరుజన్మలో నను పూవునై పూయించమని
కడసారిగా తలవంచి తల నీలాలర్పింతును పుష్పవిలాసానికి
*****💐💐💐*****