అందాల నరసింహుడు
అందాల నరసింహుడు
అందాల మూర్తి శ్రీనారసింహ
నీ అందమే బ్రహ్మానందం
ఎంత చూసినా తనివి తీరని
జగమేలె అందం నీ సొంతం స్వామి
ఏడు లోకాల సౌందర్యరాశి శ్రీలక్ష్మి
నీ వామాంకంపై చేరింది స్వామి
పదునాలుగు లోకాలు భువనభాండాలు
నీ వక్రంలో దాగి ఉన్నాయి స్వామి
మణిమయ భూషితుడు ఆదిశేషు
నీకు ఆసనం అయ్యాడు స్వామి
శోభనీయమైన శంఖ చక్రాలు
నీ హస్తాలను అలంకరించాయి స్వామి
అగ్నికణమై ప్రజ్వలించే భానుడు
నీ నేత్రాలలో ఒదిగి ఉన్నాడు స్వామి
ఆ పాద మస్తకం నీ మూర్తి దేహాన్ని
నీ నఖములు వెలుగులను నింపాయి స్వామి