హృదయ వేదన
హృదయ వేదన
నమ్మలేను చిలకమ్మ నీవు రావంటే
నిలువలేను ఒక క్షణమైనా నీవు లేకుంటే
బండరాతి గుండెపై ప్రేమజల్లు కురిపించావు
అనురాగపు ఒడిలో నన్ను మైమరపించావు
పనికిరాని వెదురును మురళిగా మలిచావు
జీవితం కల కాదంటూ కలల రాణిగా మిగిలావు
న్యాయమా... నేస్తమా... ప్రియతమా..
తోడునీడగ ఉంటానంటూ బాసలెన్నొ చేసావు
వెన్నంటే నిలిచి నన్నుముందుకు నడిపావు
కలిసి నడిచే తరుణంలో వీడ్కోలు పలికావు
ఒంటరిగ నన్నువదిలి నీవు వెళ్ళిపోయావు
న్యాయమా... నేస్తమా... ప్రియతమా..