మర మనిషి
మర మనిషి
మానవత్వం మునుపటిలా పరిమళించట్లా
ఏదో పోగొట్టుకున్న దైన్యము ఆవరించట్లా?
శ్వాస నిశ్వాసలయి సెల్ ఫోన్ గణగణలు
చేయలేదా మూగగా సెలయేరు గలగలలు
మనిషి నరాలనే తెంచి తంతులనే బిగించి
దేహమంతా మీటల్ని పేర్చి నెట్లో లయించి
తన మనసుగాక మెషినికే బానిసగా మారి
రేయి పగలే మరచి కాలాన్ని కూడ ఏమారి
తీగలు సంకేతాలతో సంభందాలు కొలుస్తూ
పక్క గదిలోకి కూడా మెస్సేజీలనే పంపిస్తూ
పోగొట్టుకున్నదేమిటో తెలిసి తాకదిలే కడకే
ఎక్కడో పోగొట్టుకొన్న మానవత్వమే వెదక
మనసు మసకేయగ ఈ మనసులేని మనిషి