STORYMIRROR

Kadambari Srinivasarao

Tragedy

5.0  

Kadambari Srinivasarao

Tragedy

ప్లాస్టిక్ భూతం

ప్లాస్టిక్ భూతం

1 min
1.0K


హరిత వస్త్రాన్ని ధరించి ముత్తైదువలా శోభిల్లుచున్న నా పుడమి తల్లిపై నానా రూప సహితమై కళావిహీనంగా మార్చుచున్నది.


హిమాద్రి మొదలు కుమారి వరకూ వనమూలికా సహిత, ఆరోగ్యకారక జలదారలను చేప క్రింద నీరు వలే ప్రవేశించి తన దురాక్రమణతో కలుషితం చేయుచున్నది.


అగ్నిదేవునితో చెలిమిని సలిపి స్వచ్ఛమైన వాయువులో మిళితమై

పొరలనన్నిటిని ఛిద్రం చేస్తూ జీవకోటిని కాలసర్పమై కాటువేయుచున్నది.


అనంతమైన నింగిని చేరి మేఘుడినడ్డీ తన మాయజాలముతో వరుణ దేవుని సైతం మాయం చేయుచున్నది


సఖ్యత నెపమున నరుడి చెంతను చేరి వ్యసనములందున అగ్రత పొంది ప్లాస్టిక్ జలగయై మానవ ఊపిరి పీల్చి వేయుచున్నది.


చెక్కను దొలిచిన చెదలవలె సృష్టినంతను అంతకంతకూ హరించుచున్నది. 


మహా భూతమై తన కోరలు చాచి కలియుగాంతమును త్వరితం చేయుచున్నది.


అదిగో... అదిగో.... ప్లాస్టిక్ భూతం!


జాగో..... జాగో.....మా'నవ' గణం




Rate this content
Log in

Similar telugu poem from Tragedy