ఎవడు గొప్ప
ఎవడు గొప్ప
గడ్డం పెంచిన నువ్వా గొప్ప
నామం పెట్టుకున్న నేనా గొప్ప
ఎవడు గొప్ప చెప్పరా ఎవడురా గొప్ప
ధర్మయుద్ధం అధర్మంచేతిలో నలిగిపోతుంటే మూగబోయిన నువ్వా గొప్ప
రామరాజ్యంలో వైదేహిని చెరిస్తే సిగ్గుపడని నేనా గొప్ప
ఏమిటంట గొప్ప చెప్పరా ఏముంది గొప్ప
నల్లముసుగులో స్త్రీమూర్తి స్వాతంత్రం కప్పిపెట్టావే నువ్వా గొప్ప
వరకట్నంతో మగువ మనసు విరిచేసిన నేనా గొప్ప
ఇదేనా గొప్ప చెప్పరా ఇందులో ఏదిరా గొప్ప
పండితులని తరిమేసావే నువ్వా గొప్ప
పక్కన చేరనివ్వక అసహించుకున్నా నేనేనా గొప్ప
ఇలాగే ఉంటె గొప్పా? అదే నా మన గొప్ప?
నిసిగ్గుగా చెప్పారా మనలో మిగల్లేదు ఏమి గొప్ప
కళ్ళు మూసుకొని చావు కోసం ఎదురుచూడ్డం తప్ప