STORYMIRROR

Nanduri Hari Priya

Tragedy

5.0  

Nanduri Hari Priya

Tragedy

జ్ఞాపకం

జ్ఞాపకం

1 min
519

ప్రతీ కదలిక లో నువ్వే ఉన్నావు

నా ప్రతి కలలో నూ నువ్వే రా


గుండే కొట్టుకునేది నీకోసం రా

ఎటు వైపు వెళుతూ ఉన్నా


నీకోసం వేతుకూ తూ ఉన్నా

నేరం నాదా

భారం నాదా


తీరం లేని ప్రయాణమే చేస్తున్నా

తీరె మారాలని ప్రాధన్న నే చేస్తున్నా


గాలికి తెగిన గాలిపటం లా

దారే తెలియక చూస్తూ ఉన్నా


రేయి పగలు నిదుర నే మాని

తప్పేమీ చేశానని ఆలోచిస్తున్నా


పగిలిన గుండె కి తెలుసు భారం ఎంటో

విరిగిన ఆశలకే తెలుసు భాధంటే ఎంటో


కళ్ళలో కన్నీ రూ అగను అంటోంది

కలలే నీ రూపు వీడను అంటోంది


కనుపాప కి ఈ సత్యం తెలిసేది ఎపుడు

కనీరే మిగిలే నని గుర్తించే దెపుడు


పల్లవి లేని పాటయి ఉన్నాను

రాగం లేని అనురాగం లో పెరిగాను


మూగ బోయిన గొంతుకు ఏమి తెలుసు

మదికే తగిలిన గాయం మానా లేదనీ


ఉలి చెక్కని శిల్పాన్ని నేనని

రాయిలా మారిన మనిషే అయ్యాననీ


గతం వీడని

గాయం నేనని


శూన్యం లో చూస్తున్నా

ఏదో ఆలోచిస్తున్నా


నవ్వటం మరిచి పోయిన ఓ మనిషిలా

నాతో నేనే పరిచయం లేని ఓ కథనం లా

మిగిలి పోయాను


ఒంటిరిగా ఉంటూ 

నాకే నేను దూరం అయ్యాను

జ్ఞాపకం లా మిగిలాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy