ప్రాణం లేని బొమ్మ లాగా...
ప్రాణం లేని బొమ్మ లాగా...
ఆగిపోయింది కాలం
మూగబోయింది ప్రాణం
వేతికా వేతికా నీ కోసం
వేచి చూసా ప్రతి నిమిషం
రాలేదు ఎవరు
కాలానికి ఎదురు
జీవించాలని ఉండలేదు
జీవం లేదని వెళ్ళలేనూ
ఉన్నా అంతే
శిలా లాగా
ప్రాణం లేని ఒక బొమ్మ లాగా...
ప్రేమ ఏమో చావదు
ఇంక ఎవరి మీద పుట్టదు
నాకోసం ఇక నేను బ్రతకను
నాకోసం ఉన్న వాళ్ల ఆశ చంపను
ఉండిపోతా ఒక శిలా లాగా
ప్రాణం లేని ఒక బొమ్మ లాగా...
గాలిలో లేదు ఈ పరిమళం
గొంతెత్తి పాడే మన ప్రేమ గీతం
కష్టం లో కూడా నీ ధ్యాసే
బాగుండాలి అంటూ చిరు ఆశ
నీ ఊసే లేని రోజే లేదు
నీ తోడే లేని నేనే లేను
నా మౌనం లో కూడా నువ్వే ఉన్నావు
నా పేరుకి నువ్వే చిరునామా
నా ప్రేమకు నువ్వే మరో రూపమా
మిగిలిపోయా ఒక శిలా లాగా
ప్రాణం లేని ఒక బొమ్మ లాగా...