ఏడిస్తే గొప్పా
ఏడిస్తే గొప్పా
డబ్బు-పేరు పోయినా
నలుగురూ ఎగతాళి చేసినా
నా అనుకున్న వాళ్లెందరో దూరమైనా
రేపన్న రోజు ఎలా ఉంటుందో తెలియకపోయినా
నేనెప్పుడూ ఏడవలేదు
నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోతుంటే
ఏడ్చాను
కన్నులు ఎర్రగా మారి నొప్పి పుడుతున్నా ఏడ్చాను
నువ్వేమన్నావ్
ఏడిస్తే గొప్పా అని
ఈ ప్రశ్నకు సమాధానం
నా దగ్గర ఇప్పటికీ లేదు