కన్నీటి కొలనులు
కన్నీటి కొలనులు


విరహాన జ్వలిస్తూ
ఒంటరినై నిదురించునపుడు
నీ స్పర్శ కోసం తపించి
జ్ఞాపకాలు గాయాల్ని తడిపినపుడు
నీ మునిపంటి గుర్తులు
స్నానాన్ని సిగ్గులమయం చేసినప్పుడు
విప్పారిన సోకులు
నీ కౌగిలి కోరినప్పుడు
వదలకూడదని కోరుకుంటూ
వదలమని వగలు పోయినప్పుడు
ఇలా అప్పుడూ ఇప్పుడూ
ఎల్లప్పుడూ
నీ పేరు విన్నా
నీ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా
నువ్వు వాడే సెంటు వాసన ఎక్కడ గుప్పుమన్నా
గుండె బరువెక్కి
నా కన్నులు అవుతాయి కన్నీటి కొలనులు.