నా ప్రేమమ్
నా ప్రేమమ్


ఎల్లోరా శిల్పానివా
ఎదలో మన్మధరాగానివా
నడకల నాట్యమయురివా
స్వర్గలోకపు దేవకన్యవా
పాలకడలిలో కలువపూవువా
చంద్రలోకపు నెలవంకవా
అవనిలో విశ్వసుందరివా
బ్రహ్మ సృష్టించిన సౌందర్యవతివా
ఎవరు నీవు?
ఎవరు నీవు?
కళ్ళలో తారకలు
పలుకుల్లో సుస్వరాలు
నడకలో మయురాలు
నడుమువంపుల్లో జలపాతాలు
నడుస్తుంటే సరిగమలు
సొగసుల్లో పదనిసలు
అధరమున సెలయేర్లు
కురులలో పరిమళాలు
తనువున సుమగంధాలు
మదిలో మనోహరాలు
పెదవుల్లో మత్తు పదార్థాలు
స్పర్శలో మాధక ద్రవ్యాలు
కొంగుచాటు వయ్యారాలు
జారుతుంటే నయగారాలు
చూపుల్లో నిలిచిపోయే అందం
కనుచూపుల్ని మరల్చే సేవా హృదయం
కనులకు నీ రూపం
మనసుకి నీ సుగుణం
అందెను ఈ క్షణం
దొరికెను "నా ప్రేమమ్"
ఐ లవ్ యూ సఖియా
ఐ యాం ఆల్వేస్ విత్ యూ ప్రియా
ఐ కాంట్ వితౌట్ యూ చెలియా...!!!