STORYMIRROR

మురళీ గీతం...!!!

Abstract

3  

మురళీ గీతం...!!!

Abstract

ఆడపిల్ల

ఆడపిల్ల

1 min
11.7K

అదృష్టం కలిసివస్తే ఇంటపుడుతుంది ఆడపిల్ల

వ్రతాలెన్నో ఆచరిస్తే కలుగుతుంది ఆడపిల్ల


ఆప్యాయత అనురాగాల కోవెలరా పడతంటే 

బాధలలో అమ్మలా ఓదారుస్తుంది ఆడపిల్ల


ఇంటిపనులు వంటపనులకు అంకితం కాదుతాను

బాధ్యతలను బరువనక స్వీకరిస్తుంది ఆడపిల్ల


కూతురిగా సోదరిగా ఒక భార్యగా అమ్మగా 

అందరికీ ప్రేమలను పంచుతుంది ఆడపిల్ల


ఇంతి కలిగియున్న ఇల్లు ఇంద్రభవనమునే మించు

సంపదలతో సుఖాలను అందిస్తుంది ఆడపిల్ల


కట్టుబొట్టు సాంప్రదాయాలకు పెట్టిన పేరు తను

సంస్కృతికి అద్దంలా కనబడుతుంది ఆడపిల్ల


ఇంటింటా వెలసినట్టి దేవతరా ఆడజన్మ

చతుర్ముఖుడు సృష్టించగా వెలుగిస్తుంది ఆడపిల్ల


మురళీ గీతం...!!!


Rate this content
Log in

Similar telugu poem from Abstract