STORYMIRROR

మురళీ గీతం...!!!

Children Stories Comedy

3  

మురళీ గీతం...!!!

Children Stories Comedy

బడిగంట

బడిగంట

1 min
11.6K

గణ గణ మోగిన ధ్వని

నిద్రలేపేను అలారం సడి

వడివడి లేచి, త్వరపడి

పరుగులిడే బాలుడి బాడీ

గుమగుమ నోరూరించే రుచి

అమ్మ చేతిలో సున్నుండల జాడి

అందుకో జాడి,లగేత్తు కై బస్సు బండి

బోర్లాపడి, బొక్కలు ఇరిగి, పళ్ళు ఊడి

డబ్ డబ్ మని మదిలో ప్రతిధ్వని

టింగ్ టింగ్ యని బడి గంటలు విని

బాలుడి చూపులో అటుఇటు కదలికలు

లోపల భయంతో గుసగుసలు

నడవడిలో గజిబిజి అలజడులు

గుర్తించిన గురుకనుచూపు రమ్మని సైగలు

బాలుడి ఎదలో గుబులు

గుండెలో గుద్దిన లబ్ డబ్లు

అటుపడి ఇటుపడి, ఊరుకులిడి

చివరికి తరగతి గదిలో పడి

కిందపడి మీదపడి,

బలపము నోట్లో పెట్టి

చేతులు అక్షరాల పలకపై ఉంచి

గుడి గుడి అంటూ దీర్ఘములు కూడి

అక్షరాల ఒత్తు,గుణింతములు వీడి

పదపదమంటూ ఆటలు ఆడి

గలగలమంటూ పాటలు పాడి

ఆటలలో పోటీ ,ప్రైజులన్ని కొట్టి

పాటలో మేటి ,చప్పట్లు చరిచి

తోటివారితో తన్నులు పడి

తన్నులు పడిన వారితో, నవ్వులు పడి

బడి బడి యని గంతులు వేసి

బడికి ఇక సెలవుయని ఉరుకువేసి

గుడి గుడి యని గుళ్లో మొక్కి

గుడిలాంటి గుటి గుడిసెలో దురి

అమ్మ అమ్మ అంటూ అరుపులిడి

అమ్మ ఒడిలో చేరి, ఇంకో బడిని చేరి

సేదతీరెను బుజ్జి బాలకుడు

బాధ తెలియక అమ్మ ఒడిలోనా

పూలవనం ,చిందులు వేసే హాస్యం

చిన్ననాటి హూసుల ఊహాగానం

మధురమైన తీపి జ్ఞాపకాలులే

అందమైన బాల్యపు అనుభవస్మృతులే.


- మురళీ గీతం...!!! 8374885700

6301476776.


Rate this content
Log in