మురళీ గీతం...!!!

Romance

4.1  

మురళీ గీతం...!!!

Romance

నా ప్రేయసి

నా ప్రేయసి

1 min
23.6K


హరివిల్లుకి అందాలను అద్దుతుంది నా ప్రేయసి

గగనానికి రంగులను పులుముతుంది నా ప్రేయసి


అచ్చుహల్లు గుణింతాల అమరికకు చిక్కలేదు

అక్షరాలకు ఆటలను నేర్పుతుంది నా ప్రేయసి


సుమాలన్ని సుగంధాలు వెదజల్లిన సఖికోసం 

పరిమళంతో మాలలను అల్లుతుంది నా ప్రేయసి


వెలగలేని చుక్కలన్ని చెలితో మెరుస్తానంటే

ఆకాశాన తారలతో ఆడుతుంది నా ప్రేయసి


చెలినివర్ణించే కవిత్వం రాయగలవా ఓ కృష్ణ!

మురళీకే గీతాలను నేర్పుతుంది నా ప్రేయసి


జగతిలోన చందమామ వెలుగులేక మూగబోతే

నిశీధిలో కాంతులను జల్లుతుంది నా ప్రేయసి


జాబిలమ్మ రానంటే ప్రకృతంత నీరసిస్తే

వెన్నెలలో చల్లదనం పంచుతుంది నా ప్రేయసి


మురళీ గీతం...!!!

8374885700


Rate this content
Log in

Similar telugu poem from Romance