నాన్న
నాన్న


ఆట నాన్న
పాడే పాట నాన్న
మాట నాన్న
నడిచే బాట నాన్న
బాధ్యత నాన్న
మనల్ని మోసే భారం నాన్న
దారినిచ్చువాడు
దారిలో నడిచిచూపేవాడు
బ్రతుకునిచ్చువాడు
బ్రతికి చూపించేవాడు
జీవం నాన్న
మనలోని నిజమైన ప్రాణం నాన్న
నాన్న అనురాగం అనంతం
నాన్న ప్రేమ అచింత్యం
మన తొలి గురువు నాన్న
మన జీవితపు మార్గదర్శి నాన్న
నాన్న అంటే ప్రోత్సాహం
నాన్నంటే భరోసా
నాన్న అంటే నమ్మకం
నాన్నంటే తిరుగులేని విజయం
నాన్నే నా ధైర్యం
నాన్నే నా శౌర్యం
నాన్నే నా బలహీనత
నాన్నే నా ఎదురులేని బలం,బలగం,సైన్యం