సరస శృంగార యాగం
సరస శృంగార యాగం


సరస శృంగార యాగం...!!!
**********************
సరదాగా వస్తావా...జ్ఞాపకాలు ఇప్పిస్తా...
సరసానికి వస్తావా...అనుభవాలు ఇప్పిస్తా...
తనువును నాకిస్తావా...రసవిధ్యను నేర్పిస్తా...
శృంగారానికి సిద్ధమా...సరసయాగం జరిపిస్తా...
మూడు ముళ్లు పడిన రాత్రి
ముచ్చటగా రైక ముడులు విప్పేస్తా...
దూరాలను చెరిపేయగా
కొత్త కొత్త సరస రహదారులను పరుస్తా...
మది తలుపులు తెరువగా
తనలో ఉషోదయం నింపేస్తా...
మనోహరియై నను చూస్తుంటే
మోముపై పెదాల చిరుజల్లును కురిపిస్తా...
తనువును ముద్దుల వర్షంలో ముంచేస్తా..
మమేకమై తన ఒడిలో సఖిని నా గుండెల్లో దాచేస్తా...
రాత్రిని పగలుతో కలిపేస్తా..
వెలుగును చీకటితో ముడివేస్తా..
హరివిల్లుకు వర్ణాలతో చిక్కెడతా...
కలువను నెలవంకతో బంధిస్తా...
ఆశలన్నీ దుప్పటిగా చుట్టి చెలిబిగికౌగిలిలో
బంధినవుతా
కోరికలన్నీ కూడబెట్టి రస యజ్ఞంలో సమిధను చేస్తా
కురులు పరిమళమై మోముపై తాకుతుంటే
నడుమే నయగారమై నా కళ్ళకు సోకుతుంటే
ఆగలేని మొహాలు చేరి నా పెదవులు వణుకుతుంటే
ప్రేయసి స్పర్శివ్వమని తనువు తహతహలాడుతుంటే
తన జలపాతపుకురులలో తడిసి నన్ను నేను మర్చిపోయాను..
తన నయగార నడుమువంపుల్లో నేను ఆడుకున్నాను
తన బిగికౌగిటిలో కదలలేని బంధీనయ్యాను
తన ఉచ్వాసనిశ్వాసలో ఊపిరినై పునర్జీవం పోసుకున్నాను
తన ప్రతి అడుగడుగుల సరిగమల సందెళ్ళలో చేరి
ప్రేమమామృతరసహృదయసరసశృంగారభావతమకపుహాయిరాగల సవ్వడులలో కలిసి
నిరంతర విద్యార్థినై రసవిధ్యలు నేర్చుతున్నా...
తన ఒడిని బడిని చేసి నవసూత్రాలు రచిస్తున్నా...
తనువు మనసు ఆగక గుసగుసలే పెడుతుంటే
కొత్త కొత్త సృష్టి రహస్యాలు కనిపెడుతున్నా...
శోభనాన పరిచిన పూలన్నీ పరిమళాన్ని గుప్పీస్తే...
శ్వేతవర్ణం చుట్టుకొని పందిరిమంచం సిగ్గుతో మొగ్గైతే.. మరపురాని రేయిలో మరువలేని హాయిలో
చెలి అధరాన్ని చిలికితే మధువు ఒలికింది
అప్పుడు...
సరసరసమధురచుంబనరతిశృంగారకేళికి సయ్యంది నిశిలో సమయం
పంచుకున్నాయి ఇరుదేహాలు ఒకరినొకరి సగభాగాలు...!!!
మనసు తెరల్లో మృదువు వెతికాను
తనువు పొరల్లో మధువు వెతికాను
తన హృదయంలో చోటు వెతికాను
నా ఎదసడిలో తనను నింపాను
*మురళీ గీతం...!!!*