Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Krbabu Kommineni

Romance

4.2  

Krbabu Kommineni

Romance

జ్ఞాపకం

జ్ఞాపకం

1 min
421


ప౹౹

జ్ఞాపకమా కోరానుగా చివరకూ నీ ప్రాపకం

చూపకుమా ఉపేక్షనే వలచి మరపు మైకం ౹2౹


చ౹౹

ఆనాటి కలను జారిపోనీకే అలా మైమరచి

ఈనాటికి ఇంకని అలనే మరల మదితెరచి ౹2౹

ఏనాటిదో ఆ వెచ్చని సౌఖ్యం మరలా వచ్చి

ఏపాటిదో ఆ సుఖం తెలుసుకొని తనేమెచ్చి ౹ప౹


చ౹౹

అరలు అరలుగా అలా ఒదికిపో ఆ పేటికలో

తెరలు తెరలుగా తరలిరా స్మరణ వాటికలో ౹2౹

కమ్మని నెమరే కమనీయ కావ్యము మదిలో

రమ్మని ఎదురేగి పదిల పరుచుకో హృదిలో౹ప౹


చ౹౹

తీయని గురుతుల తీరైన కూర్పే నీ పేరుగా

రాయని సృతులు రాగాలై రాజిల్లినే తీరుగా౹2౹

అందమైన క్షణాలనే ఆతురతతోదాచాలని

అందరు చూసివేచేది నీవే తిరిగి పంచాలని ౹ప౹


Rate this content
Log in

More telugu poem from Krbabu Kommineni

Similar telugu poem from Romance