తరలిపోయే వసంతం
తరలిపోయే వసంతం
- ప౹౹
తరలి పోయే వసంతం ఎంతకూ తానే విసిగి
మరలి వచ్చునా మరలతిరిగి ఎక్కడో పొసిగి ౹2౹
చ౹౹
పూచే పూల పరాగమే ఫలదీకరణం చెందేనా
వీచే గాలి గాంధర్వం మరి గమ్యమూ చేరేనా ౹2౹
వలపు జాబిలి వన్నెలలు వరసలూ కూర్చేనా
మలుపు మజలీ మంజూషలే అడిగి పేర్చునా ౹ప౹
చ౹౹
కోరి వచ్చిన కోరికలు కొరతనే గురుతెరుగునే
మరిచొచ్చిన మరులే మధురిమలు ఎరుగునే ౹2౹
తలపుల మది తాళం తరలి శూన్యం మిగుల
అలపుల ఎదకు అలుకలతో ఆక్రోశమే రగుల ౹2౹
చ౹౹
తిరస్కరించిన ప్రేమకు త్రికరణ శుద్ది లేదనేగ
మనస్కరించని మనసుకు ఇక దారి ఏదనేగ ౹2౹
తరలి పోయే వసంతం ఎంతకూ తానే విసిగి
మరలి వచ్చునా మరలతిరిగి ఎక్కడో పొసిగి ౹ప౹