తీగలా అల్లనీ
తీగలా అల్లనీ
తీగలా అల్లే తిరుగులేని ప్రేమనే కొనసాగని
మూగలా మౌనంతోనే ఉండిపోకు అలాగని
మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని
వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని
చెంపకు చారడేసి కళ్ళతోనే కోరికేదో కోరని
చంపకు బాకులాటి ఆచూపులనే మరలని
తీగలా అల్లే తిరుగులేని ప్రేమనే కొనసాగని
మూగలా మౌనంతోనే ఉండిపోకు అలాగని
వచ్చిన వసంతం వలపంతను వాకిటనే చేర్చగా
నచ్చిన మనసంతనే నవనీతమై రాగం కూర్చగా
మాయచేయకు మనసునే మోసపోదు తేలికగా
లోయలోతులాటిదని అది పోల్చవచ్చే పోలికగా
తీగల
ా అల్లే తిరుగులేని ప్రేమనే కొనసాగని
మూగలా మౌనంతోనే ఉండిపోకు అలాగని
సహనమేలనోయి సరసాల చెలియ కవ్వించ
అవగాహనలేమినోయి ఆశల కళ్ళెము దించ
కోరికెంత బలమైనదో ఆ మనసుకు తెలుసూ
చేరికెంత వీలైనదో చేతలతో చూపకే అలుసూ
వలపుబాణం వాడితనంతో చెలరేగిపోనిమ్ము
గెలుపు తోరణమే గంతులేస్తూ దరిచేరనిమ్ము
వలపుబాణం వాడితనంతో చెలరేగిపోనిమ్ము
గెలుపు తోరణమే గంతులేస్తూ దరిచేరనిమ్ము
తీగలా అల్లే తిరుగులేని ప్రేమనే కొనసాగని
మూగలా మౌనంతోనే ఉండిపోకు అలాగని