ప్రేమ కదనం
ప్రేమ కదనం


ప౹౹
కలిగించాలని మదిలో మరులతో ఆశ
వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ ౹2౹
చ౹౹
ఉసిగొలిపే ఊపులతోను ఊరించాలని
ఊసేకలిపే ఉలుకులతో పలికించాలని ౹2౹
కోరి వచ్చా కోమలికి దారినే చూపాలని
నారి ఇచ్చా మనసునే ప్రేమే కలపాలని ౹ప౹
చ౹౹
కాగల కార్యం గంధర్వులెవరూ తీర్చరు
చేయగల ధైర్యంచేసి చేసెయ్ కూర్చను ౹2౹
మనసు మాటా వినవా మంచితనంతో
ధనసు వదిలిన బాణమౌ కొత్తదనంతో ౹ప౹
చ౹౹
ఎదురు చూపులతోనే ఎడారి పయనం
నదురులేని నిర్ణయమే నగుపాల వైనం ౹2౹
చీకటి రేయికిని ఉదయమొకటున్నదిలే
వాకిటచేరిన వలపు వరసెప్పుడన్నదిలే ౹ప౹
చ౹౹
గుండె గుబులూ పెరుగేనులే గుర్తించవా
మండే మదికిని స్వాంతనై చిగురించవా ౹2౹
వలపను వదలక చూపాలి వదనములో
గెలుపునే ఆస్వాదించీ ప్రేమ కదనములో ౹ప౹