జయమేలే
జయమేలే


ప౹౹
భయమేలే కోరిక వెల్లడించనే భయమేలే
జయమేలే అతడికి ప్రకటించ జయమేలే ౹2౹
చ౹౹
మదిలో మారాకువేసి రగిలించెనూ ప్రేమ
కదిలి అతడిఎలమిని గుర్తించు ఆ భామ ౹2౹
కాదనక అవుననక కవ్వించును ఆ లేమ
ఏదురే చూడక ఎదనే మరిచేర్చు లలామ ౹ప౹
చ౹౹
కోరి వచ్చినా తరుణికి కొరత చేయకుమా
చేరి చెంత మదిలో కోరికనే కనుగొనుమా ౹2౹
మబ్బుచాటు చందమామే మగువ కోరిక
జబ్బ చరచి తీర్చుమా ఆ ఇచ్చ చేసితీరిక ౹ప౹
చ౹౹
మాటనే పెదవి దాటించనే అతని భయం
ప్రేమ మీటనే నొక్కక వదిలిన అపజయం ౹2౹
జంకేలానో మదిని వ్యక్తపరచనూ అతడికి
జాగేలనో తృప్తిపరచ కోరినటుల ఎప్పటికి ౹ప౹