STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4.9  

Ramesh Babu Kommineni

Romance

వలపు వాకిలి

వలపు వాకిలి

1 min
35K


ప౹౹

 కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా 

పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా ౹2౹


చ౹౹ 

కనులూ మాత్రమే కాదు వలపుకూ వాకిళ్ళూ 

పనులూ మానేసి చూడాలనే ఎలమి నకళ్ళూ ౹2౹


అంచులుగా రాసిన అంజనం ఓ అద్భుతము 

సంచయంగా చేరిన అందాలే వేచిన దృతము ౹ప౹ 

చ౹౹

చెప్పతరమే చెదిరినా నయనాలతో ఆ అందం 

గొప్పతనమే కదిలి కలిపిన తనువుతో బంధం ౹2౹


చిలిపి చూపుల సింగారం చింతలు పెంచేనుగ

 కలిపి చందనాలే కలహంసలే ఊహలెంచెనుగ ౹ప౹ 


చ౹౹

వలరాజు ధనువూ తలపులలో వెలిగే తనువు 

కలలో రోజు కలతలూ మాపివేసే కామధేనువు ౹2౹


ముంగురు ముచ్చటా కనుగవతో నవ్వు కలిపి

 బంగరు బంధమే వేయదా రాసేసి ఓ కొత్త లిపి ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance