నువ్వు నవ్వినప్పుడు....
నువ్వు నవ్వినప్పుడు....
నువ్వు నవ్వినప్పుడు....
నీ కళ్ళల్లో మెరుపు
అందంగా విచ్చుకునే నీ పెదవులు
ఆ పెదవంచున నాట్యమాడే నీ చిరునవ్వులు
నువ్వు నవ్వినప్పుడు....
నీ స్వరం చేసే అల్లరి
నీ అరచేతులు చేసే సంబరాల సంకేతాలు
నీ చిట్టి పొట్టి పాదాలు చేసే సవ్వడి
నువ్వు నవ్వినప్పుడు....
నీ కల్మషం లేని మనసు
ఆ మనసునిండా అమాయకత్వం
ఆ అమాయకత్వానికి తోడుగా చిలిపితనం
నువ్వు నవ్వినప్పుడు.....
ఎరుపెక్కే నీ బుగ్గలు
పొదిగిన ముత్యాల్లా నీ దంతాలు
విల్లులా వంగే నీ తడి పెదవులు
అన్నీ కలగలిపి నా హృదయాన్ని మీటినప్పుడు కలిగే మాధుర్యం వర్ణింప తగనిది...
(ఈ కవిత మా బుజ్జిగాడికి అంకితం)