STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

వచ్చినదీ వసంతం

వచ్చినదీ వసంతం

1 min
339

వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం

నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం

కొత్త సింగారం కోరికలా విచ్చిన పువ్వులే

హత్తుకొనెనే ఆ ఆమనిలా ఆమె నవ్వులే


వెన్నెలరాత్రి వేకువ అరుదెంచే తెలియక

నన్నిలా మైమరపించే మనసు అలియక

వేచిన సమయం వేడుకలా జరిగి పోయే

పూచిన పున్నమి వాడుకగా కరిగి పోయే

వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం

నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం


కారణమే చెప్పదూ కరుణలేని కామితం

రణమే చేయునే ఇది రక్షణలేని జీవితం

మందులేని ప్రేమకు నయం ఏముందిలే

కామందులా కాయనూ మనసే ఉందిలే

ఆది మానవుల నుండి అమరమేనుగా

అందిన ప్రేమనే గెలవనే సమరమేనుగా


వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం

నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం

కొత్త సింగారం కోరికలా విచ్చిన పువ్వులే

హత్తుకొనెనే ఆ ఆమనిలా ఆమె నవ్వులే


మరపురాని రేయిలో మరలరాని తీపినే

అలపులేని హాయిలో తేల్చగ ఆ కూపీనే

మరపురాని రేయిలో మరలరాని తీపినే

అలపులేని హాయిలో తేల్చగ ఆ కూపీనే


వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం

నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం

కొత్త సింగారం కోరికలా విచ్చిన పువ్వులే

హత్తుకొనెనే ఆ ఆమనిలా ఆమె నవ్వులే



Rate this content
Log in

Similar telugu poem from Romance