నిదురే రానీదు
నిదురే రానీదు


ప౹౹
నిదురే రానీదు నింగిలోని ఆ చందమామ
చెదిరే కలనూ చేరనీదు అందమైన భామ ౹2౹
చ౹౹
ఎంత సోయుగమో మరి వేచెను యుగం
చింత పెరిగి చిలిపి రేగే మదిలో ఓ భాగం ౹2౹
అదుపు తప్పిన ఆశలూ అలసి సొలసినే
పొదుపు లేని కోరీక అలా కలసి మెలసినే ౹ప౹
చ౹౹
ఏకాంతం వెన్నెల వేడెక్కి వెక్కిరించెనుగా
ఏ శాంతంలేని ఎదనేకోరి తస్కరించెనుగా ౹2౹
రేయన్నదీ రెచ్చిపోయి రచ్చరచ్చనే చేసెనే
హాయన్నదీ అచ్చిలేదని అదనే మరిచేసెనే ౹ప౹
చ౹౹
ఎదురైన ప్రేమలో ఎదురు చూపే యాతన
కుదురైన కుందనానికీ కుదరకనే ఆవేదన ౹2౹
నిదురే పోనీదూ తొంగిచూసే చందమామ
చెదిరిపోయే కలలను చేర్చుకోని ఓ భామ ౹ప౹