ఏదో వైనం
ఏదో వైనం


ప౹౹
ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే
అదో అదో మైకం మదినే అదిమి వేసే ౹2౹
చ౹౹
కొత్త అనుభవం మత్తులో ముంచెను
కొంత తడబాటే మనసులో పెంచెను ౹2౹
ఏమి మాయో ఎరుక తెలియకున్నది
ఏది నిజమో అసలు పోల్ఛలేకున్నది ౹ప౹
చ౹౹
చెలియ చూపూ ఓ చెకుముకి రాయి
తొలయు ఎద వదలకా పగలు రేయి ౹2౹
వచ్చిపోయే పున్నమే వెన్నెలే పంచినే
అచ్చిరానివేళే నిలిపే ఆవలి అంచునే ౹ప౹
చ౹౹
కోరికేమో కొండలా పెరిగి పెరుగునులే
ఊరికేమో ఉండకే ఉండి కరుగునులే ౹2౹
ఎంత ప్రేమో అది వరదలై పొంగెనులే
చెంత చేరిన చెరిసగమై పరుగిడేనులే ౹ప౹