కనులు మూసినా..
కనులు మూసినా..


ప౹౹
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో
మునులు తపసు చేసినా ముక్తిలేదుపో
వలపులోన వదనమూ ఒదిగి పోయాక
తలపులోన తనువంతా ఒరిగి పోయాక
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో
చ౹౹
రేయిపగలు రెచ్చిపోయి ఎదలో గుచ్చిపోవునే
హాయిసెగలు వచ్చిపోయి పూలై విచ్చిపోవునే
సుఖాల జావళి సుందరా వనాలలో ఆలపించే
రాగాలా రవళి రాయంచలా మెల్లగా ఆలకించే
మదిలోన మారాం చేసి మనసునే ఆడించేనూ
నదిలోని సుడిలా నరాలలో నాట్యమే చేసేనూ
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో
మునులు తపసు చేసినా ముక్తి లేదుపో
చ౹౹
ప్రేమంటే పెనవేసి పెంచేసి పెరిగేదేలే
రమ్మంటే రప్పించి రావించి రగిలేదిలే
కోరికలే కొలువుదీరి కొసరులు కోరగా
తారకలై తళుకుమని తపనలై తీరకా
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో
మునులు తపసు చేసినా ముక్తిలేదుపో
వలపులోన వదనమూ ఒదిగి పోయాక
తలపులోన తనువంతా ఒరిగి పోయాక
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో
కనులు ఎంతమూసినా నిదుర రాదుపో
కనులు ఎంతమూసినా... ఆ....ఆహాహా