సౌందర్య గానం
సౌందర్య గానం


సౌందర్య గానము
వింటిని నే సౌందర్య గానం
సుందర హృదయారవింద దివ్య రాగం
చూసితిని
మరచి పరిసరముల
పరవశించి పాడే ప్రకృతిని
ముద మందె మది
వయ్యారంపు ఆ పాటకు
తెల్లని మల్లెల వలె కాంతులీను
పలువరసల కనిపించీ కనిపించ నీయక
మధురిమల నిలయములు
అధరములు కదలీ కదలక
వెలువరించిన గానమును కంటిని
వెలుగుల కోవెలలో నుంటిని
మౌనగీతమా పాట
మనసుకు సన్నిహితము హితము
సుపద సహితము రాగయుతము
ఆనందము నిండిన
ఆనందము కనబడె
వినబడె మనసుకు
ఆమె మనసు గతులు సంగతులు
భౌతికముగ చేరువకాక నిలచినను
తెలియును చెలి చిత్తము
పరస్పర హృదయాశ్లేషానందమున
ప్రమోదము ప్రశాంతత నిండిన
రమ్య స్థలము ప్రియ రమణీ
సరసహృదయాంతరంగము
వింటిని
వినుచున్నాను
ఆ రస గుళిక
ఆలాపించుచున్న
సౌందర్య గానము