సాదర ఆహ్వానము
సాదర ఆహ్వానము
సడలును, వడలును ఒడలు
గత జీవితమగును స్మృతి
భవిష్యత్తు ఇంత వరకు
జీవించినంత సేపు ఉండదు
మనిషి శరీరం, జీవితం పరిణామ పేశలం
సతత కాల ప్రవాహ భూయిష్టము
కాలము, ప్రదేశము స్పృహలై ఉండును
వర్తమానము వాస్తవమైన గమనిక
తత్త్వము, ఆధ్యాత్మికత
జీవిత పరమార్థము కానవసరం లేదు
ఆత్మీయులైన కుటుంబ సభ్యులు
ప్రేమతో సాకి వృద్ధాప్యమును
వృద్ధాశ్రమం ఊసు ఎత్తకుండగ
సాదరముగ ఆహ్వానింప జేసిన