రక్షక భటుడు
రక్షక భటుడు


శాంతి భద్రతలే ధ్యేయంగా
కట్టుబాట్లను కాపాడుటే ఆశయంగా
కఠోర శిక్షణను పొంది
వృత్తి ధర్మమే పరమ ధర్మంగా
విధి నిర్వహణే ఊపిరిగా
అంకిత భావంతో
పనిచేసే రక్షక భటునకు
కుటుంబ సంక్షేమం పట్టించుకునే సమయం లేక
రోజంతా విధి నిర్వహణలో
మునిగితేలే రక్షక భటునకు
మానావమానాలను పరిగణింపక
పరరక్రమించే పరిశ్రమించే రక్షక భటునకు
ప్రాణాలను ఫణంగా పెట్టి
తుపాకి గుండ్లకు బలియైన
మందుపాతరలకు ఛిన్నాభిన్నమైన శరీరాలతో
అనంతలోకాలకు తరలి వెళ్ళిన
నిస్వార్థ జీవులకు,కర్మయోగులకు
అంకితభావంతో ,బలియైన
మానవతా మూర్తులైన రక్షక భటులకు
శాంతికలగాలని,ధన్యతా మూర్తులైన వారికి
మనసా,వాచా,ప్రణామాలర్పిద్దాం
మానవత్వ విలువలను చాటుదాం