మాతృ హృదయం
మాతృ హృదయం


వృద్దాశ్రమంలో కనిపిస్తుంది రోజురా
దగ్గరికెళితే తెలిసే అది
మాతృ హృదయ స్పందనరా
అమ్మా అన్న పిలుపుకోసం
వారు పడుతున్న వేదనరా...
ఎవరైనా పిలువవచ్చు
అమ్మా అన్న పిలుపును
కన్న బిడ్డ పిలుపుకే
మాతృ హృదయం కరిగేను
కొంతమంది కదృష్ఠం
అమ్మమ్మలు, నానమ్మలు
వారిచెంత పెరగడం
పూర్వజన్మ సుకృతం
మథెర్స్ డే, ఫాథర్స్ డే
అన్ని డేస్ ఒక్కటేరా
మనంలేక వారు పడే
వేదనలు ఎవరికీ వద్దురా
మనచెంత వున్నవరకు
ప్రతిరోజూ పండగేరా...
అమ్మా నాన్న ఉండికూడా
అనాధగా బ్రతకడం
మనం చేసుకున్న ఖర్మరా..
వృద్దా శ్రమాల వెంట పరుగులేమో తీయకుంట
వారి ప్రేమలకంట బానిస లవుదామంట...
ఆవేశం పక్కబెట్టి ఆలోచన ముందు బెట్టి
తీసుకున్న నిర్ణయాలు మన జీవితంలో
విలువైన పాఠాలు.....