మాస్క్
మాస్క్

1 min

18
రోడ్డుమీదకు రాక మాస్కు ఉంటేనమ్మా
సర్కారు వాళ్ళు ఆజ్ఞయితే ఇచ్చిండ్రు
మాస్కులుండాలని చెప్పారే కానీ
దానికి నియమాలు సక్కగాలేదు
వ్యాపార రీత్యా రంగూల మాస్కూలు
పేదోళ్లు మాత్రం రుమాలు కడితేను
మధ్యతరగతి వాళ్ళు సాదా మాస్కులతోను
మరి కొందరు మాత్రం మాచింగ్ మాస్కులతోను
ఉన్నోళ్లు మాత్రం వెండి మాస్కులతోనూ
జర భద్రంగుండాలయ్య జనాల మధ్య లో
మన జాగ్రత్తలతో మనముండకపోతే
నష్టపోయేదేమో మనమేనండీ
సెల్ ఫోన్లు చేతిలో పట్టుకోకండి
సంచిలో/జేబులో ఉండనీయండి
అవసరం ఐతే తప్ప బయట తీయకండి
మాస్కుల ముసుగులో దొంగలున్నారండీ
బహు జాగ్రత్తగా మనముండాలండీ
అందంకు కాదయ్యా ఇది (మాస్కు )ఆరోగ్యం కోసమే..