అనుమతి
అనుమతి


కరోనాతో జీవితం గడపాలన్నారాయె
ఎన్ని రోజులని చెప్పకపోయే
బళ్ళు గుళ్ళు ఏమో మూత బడ్డదాయె
భక్తులందరేమో ఎదురు చూడడమాయె..
పరిశ్రమలకేమో అనుమతి ఇచ్చిండ్రు
పరిమిత సంఖ్యలో పనిచేసుకోమని
దైవ దర్శనానికి అనుమతి నివ్వరే
మీ చట్టాలకు లోబడి సహకరిస్తామయ్య
మా ఇలవేల్పులను చూడనియ్యవయ్యా..
ఎన్ని రోజులని నిను కానక మేము
ఎదురు చూపులతోనే సరిపోయెనయ్యా
సర్కారు వాళ్లేమో మంచి నిర్ణయాలు
తీసుకుంటారని ఎదురు చూద్దామయ్య
పచ్చ జోన్లలోన అనుమతి ఇవ్వండి
భక్తులు నన్నుచూసి ఆనందపడుతారు
వీఐపీ లేమో రానే వద్దండి
సామాన్య భక్తులు సంకట పడుతారు..