తొలి వీడ్కోలు - వచన కవితా
తొలి వీడ్కోలు - వచన కవితా


అమ్మా నాన్నల చేయూతతో బాల్యమున నడక నేర్చిన శైశవదశలో
రోదించి, బెట్టుచేసి అయిష్టముగా చేరితి నే శిశు తరగతిలో
పరిసరాలను , అవలోకించి సర్దుకుపోయితి పైతరగతుల్లో
గురువులు నడత నేర్పి నన్ను ఋజుమార్గమున ప్రవేశింపజేసిరి
నా వ్యక్తిత్వము, జ్ఞానము , విచక్షణా శక్తి తో నన్ను తీర్చి దిద్దిరి
కానీ , నా బాల్య చేష్టలతో నే విసిగింపజేసి వారి ఆదరణకు దూరమైతి
వారే ఓపికతో జీవితమున శక్తివంచన లేక మార్గ దర్శనం చూపితిరి
పాఠశాల విద్యను గఱి పిన నేను నా సహ విద్యార్థుల తో ,
గురువు కూ , మిగిలిన విద్యార్థులకు తొలి వీడ్కోలు పల్కితిని
జీవితాన స్థిర పడుటకు కావాల్సిన సలహాలను వారిచే పొంది
వారికి (గురువులకు ) పాఠ శాలకు ఎనలేని కీర్తిని సంపాదించ తల పె ట్టితిని.