నీ నీలికన్నుల్లోన
నీ నీలికన్నుల్లోన
నీ నీలి కన్నుల్లోన
నీ నీలి కన్నుల్లోన కన్నీరేలా......
నేను నీ చెంత లేననా.....
పిచ్చి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను.....
నీ కంట కన్నీరు కారితే....
ఆ కళ్ళలో నా రూపం జారిపోతుందేమో.....
చప్పున దాచెయ్ వాటిని....
నీ నీలి కన్నుల్లోన ఆనందమేల.....
మన ఎడబాటు ముగిసిందనా....
నేను నీ చెంతనే ఉన్నాననా........
నువ్వే నేనయ్యాననా.....
లేక నా కళ్ళలో వున్న నీ రూపాన్ని చూసా.......
దగ్గరగా వున్న నన్ను నీ కళ్ళలో బంధించినందుకా......
నీ నీలి కళ్లలోనా కోపమేల....
ఇన్నాళ్ల నా ఎడబాటుకా....
లేక నే చేసే చిలిపి పనులుకా....
నచ్చిన చిన్నది చెంత నుంటే మనసు ఊరుకోదే....
ముద్దుతోనే సరిపెట్టనుగా, హద్దు దాటలేదుగా....
అన్ని తెలిసినా ముక్కు మీద కోపమెందుకే ముద్దుగుమ్మ.......
నీ నీలి కన్నుల్లోన బాధ ఎందుకే...
నిన్ను వదిలి వెళ్లే సమయం వచ్చిందనా....
ఈ ఎడబాటు ఇంకెన్నాళ్లు అనా....
బాధపడకు బంగారు....
పసుపుతాడుతో వచ్చి పరిణయమాడతాను....
పూలపల్లకి ఎక్కించి అత్తారింటికి తీసుకుపోతాను.....
నీ నీలి కన్నులు నవ్వుతున్నాయే....
నీ ప్రియుడు చెప్పిన ఊసుల బాసలకా....
లేక ప్రియుడు చేసిన చిలిపి పనులుకా....
నవ్వుతూ నీ కళ్ళు మూసుకోకు కోమలాంగి....
మళ్ళీ నిన్ను చేరే వరకు, నీ నీలి కళ్ళ సోయగాన్ని మదిలో నింపుకోనివ్వు....
చెరిగిపోని జ్ఞాపకాలుగా యద సంపుటిలో భద్రపరుచోకోనివ్వు......