మహిళ నీకు వందనం
మహిళ నీకు వందనం


అమ్మ గా అమృతాన్ని పంచుతుంది
అర్ధాంగి గా అడుగడుగునా తోడుంటుంది
అక్క గా ఆత్మీయతను పంచుతుంది
చెల్లిగా చెలిమి చేస్తుంది
తనయ అయిన కన్నవాళ్ళకి తల్లిగా మారుతుంది
కోడలు గా కొత్త తరాన్ని అందిస్తుంది
మరదలు గా మర్యాదలు చేస్తుంది
వదినమ్మ గా మరో అమ్మలా మారుతుంది
అన్ని బాధ్యతలు ,బంధాలు
బరువు అనుకోకుండా మోస్తుంది
ఆంక్షలు విధించిన అవనిలాగా భరిస్తుంది
స్వేచ్ఛ నీ హరించి శ్రమలకి గురి చేసిన
క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది
తన వాళ్ళకి కష్టం వస్తె తల్లడిల్లిపోతోంది
తన వాళ్ళే కష్టం కలిగిస్తే తనలోనే దాచుకుంటుంది
కుటుంబ బాధ్యతలలో పాలు పంచుకుంటుంది
కష్టం వస్తె కష్టం కరిగేదాక ధైర్యంగా పోరాడుతుంది
చిన్న ప్రోత్సాహం అందిస్తే చిరు దివ్వెలాగా
వెలుగుతుంది
ఆ వెలుగునే అందరికీ పంచి ఆదరణ
పొందుతుంది
అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుంది.....
మహిళకు మహోన్నత శిఖరాలు అందియ్యక
పోయినా మరుగునపడేలా చెయ్యకండి..........
మర్యాద,గౌరవం , స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వండి....
మానవ మృగాలు గా మారి హరించకండి......