ఆడవారి మాటలు
ఆడవారి మాటలు


"ఏమిలాభము చేతులు కాలాక ఆకులు పట్టుకుని,
కోపగించారు ఆనాడు, అన్నానని వ్యాపారం చేయొద్ధని,
ముడుచుకొన్నారు చేతులు నేడు, ఉన్నదంతా ఊడ్చుకొని,
హామీలిచ్చారు పెళ్ళిలో కట్నకానుకలు భారీగా ఇస్తానని,
ఊహించలేదు మీరు, మనకు రాగలదని ఇటువంటి గడ్డుస్థితి,
నేడు ఇవ్వకుంటే కట్నకానుకలు, బిడ్డపెళ్ళి ఆగిపోయే పరిస్థితి,
ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వాలి ఏహామీలైనా ముందువెనుకలు,
విడిచిపెట్టాలి, ఆడపెత్తనం , బోడిపెత్తనం అన్న మాటలు,
సారధ్యం వహించే వారమే ఇంటికిరువురం, మరెందుకీ తారతమ్యాలు?"
ములుకుల్లా గుచ్చుకున్నాయతనికి భార్యచెప్పే వాస్తవాలు.
"దేనికీ గతజల సేతుబంధనం, సూటిగాచెప్పి ఇవ్వు నీ సలహాలు."
నవ్వుకుని లోలోన ఆ మాటలకామె "తప్పుతాయా
తిప్పలు,
వ్యాపారం లో సాధారణ మైన విషయాలు ఇటువంటి లాభనష్టాలు,
వగుస్తూ వాటికై ఆపలేము, జరగాల్సిన ముఖ్యమైన
పనులు,
తలతాకట్టు పెట్టైనా చెల్లించాలి పెళ్ళివారికిచ్చిన ఆ
హామీలు,
తాకట్టు పెట్టి ఊరిలోని ఎకరంపొలం తీసుకొచ్చి
సొమ్ములు,
జరిపిద్దాం అమ్మాయిపెళ్ళి పెళ్ళివారితో పడకుండా
ఏ పేచీలు
అర్ధంచేసుకోండి ఇప్పటికైనా, పెడచెవినపెట్టక నా
మాటలు."
అతనికి కలిగింది పశ్చాత్తాపం విని భార్య మాటలు,
"మన్నించు, అనుసరించాను ఇన్నాళ్లు, విని పెరవారి
చెప్పుడు మాటలు,
ఇక నుండీ ఒకేమాట, ఒకేబాటగా కలిసి తీసుకుందాం
అన్ని నిర్ణయాలు."
ఆమె మది ఆనంద పరవశమందింది విని యాతని
ధృఢమైన వాక్కులు.