కొత్త కోడలు
కొత్త కోడలు


చిన్ననాడు. --
అమ్మానాన్నకు ముద్దులపట్టిని, ఇద్దరుఅన్నల గారాల చెల్లిని
స్నేహితులకు ప్రియ నెచ్చెలిని, అందరిదృష్టిలో బంగారు తల్లిని
అమ్మ తినిపించే గోరుముద్దలు, నాన్న తెచ్చే పళ్ళు, మిఠాయిలు
అన్నలు ప్రేమతో తెచ్చే చాక్లెట్లు, ఆనందంగా గడిచిన రోజులు
ఆనాడు ---
పెళ్ళై వెళ్ళాను అత్తారింటికి,అత్తమామల ఆదలింపులకి
ఆడపడుచుల ఆరళ్ళకి, బెదిరాను భర్త కోర చూపులకి
నోరెత్తకుంటే పెత్తనం చేస్తారు, మాట్లాడకుంటే మూగిదంటారు
జవాబిస్తే గయ్యాళి దంటారు, ఎలాఉన్నా విమర్శిస్తారు
అలవాటు పడ్డాను కొన్నాళ్ళకి, తీరేను ఈబాధలు ఎన్నాళ్ళకి
మోయలేను ఇవి పుట్టింటికి, నేనే తెరదించాలి ఈకడగళ్ళకి
ఈనాడు. ---
తప్పు లేనిదే మాటపడను, ఎవరన్నదీ తిరిగి చూడను
అందరికి సరైన జవాబిస్తాను, నావిలువను తిరిగి పొందుతాను
అత్తమామలను సేవతో కట్టేశాను, ఆడబిడ్డలను మాటలతో పడేశాను
భర్తగారిని ప్రేమతో తిప్పుకున్నాను, అందరినీ నావారిగా చేసుకున్నాను
ఓర్పుతో అత్తింట గెలిచాను, నేర్పుగా పేరు తెచ్చుకున్నాను
పుట్టింటి పరువుని నిలిపాను, మళ్లీ నవ్వులు పండించాను