STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

భావితరం భవిత

భావితరం భవిత

1 min
268

చదువులు చదువులు చదువులు

ఎంతసేపూ ఇంజనీర్లు, డాక్టర్లు,

కలెక్టరు, పోలీసు ఉద్యోగాలు

ఇవేనా లోకంలో ఉన్న చదువులు

వీరందరినీ తీర్ఛిదిద్దే ఉపాధ్యాయులు

మరి, వారే కదా వీరికి వేసేది పునాదులు!

మనకి ఉన్నవి అరువది నాలుగు కళలు

ఏకళ నేర్వడానికైనా కావాలి శ్రద్ధాసక్తులు

ఒకొక్కరి జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి

అందరూ ఒకేలా ఎలా ఆలోచించ గలిగేది

శ్రద్ధగా, ఆసక్తిగా నేర్చినట్లు నచ్చినది

నేర్వలేరు ఎంత కష్టించినా నచ్చనిది.

కన్నామని మనకు ఉండవు సర్వహక్కులు

సూచించాలి, గమనించి వారి ఇష్టాఇష్టాలు

ఉంటాయి పిల్లలకి స్వంత ఆలోచనలు

కాదని వాటిని, చేయరాదు ప్రయోగాలు

చేయూత నివ్వాలి, నడపరాదు చేయిపట్టి

వారే కావాలి, నిర్మాతలు వారి భవిష్యత్ కి

పెంచరాదు వారిని, ఒకరిపై ఆధారపడేలా

ఉండాలి వారే, పదిమందికి ఊతమిచ్చేలా.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational