గమనమే సాగాలి..
గమనమే సాగాలి..


ప౹౹
గమనమే సాగాలి ఘనమై నవ గమ్యమై
గగనమే దిగిరావాలి ఓ గానమై రమ్యమై
అలపులేని పయనం చేర్చును అందలం
మలుపు కోరి మజలీ పేర్చును ప్రోద్బలం
గమనమే సాగాలి ఘనమై నవ గమ్యమై
చ౹౹
చాకచక్యమే చాలా కావాలిలే విజయానికి
కాలచక్రమే కలసి రావాలిలే ఆ కర్తవ్యానికి
యువతరమే మార్గం చూపాలి ముందుకు
నవతరమే నడుమే బిగించాలి సాగేందుకు
గమనమే సాగాలి ఘనమై నవ గమ్యమై
గగనమే దిగిరావాలి ఓ గానమై రమ్యమై
చ౹౹
దిక్కులే పిక్కటిల్లాలి ఆ విజయఘోషతో
చిక్కులే చక్కదిద్దాక కానరావే ఏ మిషతో
దిక్కులే పిక్కటిల్లాలి ఆ విజయఘోషతో
గమనమే సాగాలి ఘనమై నవ గమ్యమై
చ౹౹
పట్టుదలా పరమ మంత్రమై కావాలిలే
పెట్టుబడిలా పెను ధైర్యము రావాలిలే
మొక్కవోని దీక్ష ఆ చుక్కాని చూపాలి
చక్కనైన ఫలితమూ అక్కునా చేరాలి
దిగులేలా యువతా దిగంతాలే జయించను
బిగువైనా కోరికా మనసంతను లయించను
దిగులేలా యువతా దిగంతాలే జయించను
బిగువైనా కోరికా మనసంతను లయించను
గమనమే సాగాలి ఘనమై నవ గమ్యమై
గగనమే దిగిరావాలి ఓ గానమై రమ్యమై
అలపులేని పయనం చేర్చును అందలం
మలుపు కోరి మజలీ పేర్చును ప్రోద్బలం
గమనమే సాగాలి ఘనమై నవ గమ్యమై
గమనమే సాగాలీ ఘనమై నవ గమ్యమై