పుస్తకాల్లో స్వాతంత్ర్యం
పుస్తకాల్లో స్వాతంత్ర్యం


కథలు మారుతున్నాయి
కథలు చెప్పేవారు
కథల్ని చూపించేవారు
చెప్పిందే నిజమని నమ్మేవారు
చరిత్రను కథలా చూస్తున్నారు
స్వతంత్ర్యం కోసం చేసిన పోరాటం
కేవలం పుస్తకంలోని కథలా ఉండిపోకూడదు
తల్లి తండ్రులు తమ బిడ్డకు చెప్పాలి
స్వాతంత్ర్యం ఊరికే రాలేదని
దాని వెనుక ఉన్న యోధుల త్యాగం
ఆకలి కేకలు అరెస్టులు
విప్లవాలు సంగ్రామాలు
అవమానాలు ఆక్రందనలు
అహింసా మార్గాలు
ఇవన్నీ చెప్పాలి
ఉపాధ్యాయులు
సిలబస్ కోసం పూర్తి చేసే పాఠంగా
ఈ జాతి స్వాతంత్ర్యం
మిగిలిపోకూడదు
త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు
ఈ దేశ పౌరుడు అయినందుకు
ఛాతీ నిండా గర్వంతో
సెల్యూట్ చేసిన విద్యార్థుల కళ్ళలో
నా భారత జాతి స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం
మిరుమిట్లు గొలుపుతూ కనిపించాలి
అదే స్వేచ్ఛా భారత్
ఆ రోజు (రావాలి) తేవాలి