ప్రతి మహిళ ఒక మణిపూసే కదా!
ప్రతి మహిళ ఒక మణిపూసే కదా!


ఆమె ఒక శిల!
ఆమె ఒక అల!
ఆమె ఒక కల!
ఆమె ఒక కళ!
ఆమె ఒక వల!
ఆమె ఒక గోల!
ఆమె ఒక శ్యామల!
ఆమె ఒక పరిమళ!
ఆమె ఒక ఊయల!
ఆమె ఒక కోయిల!
ఆమె ఒక వెన్నెల!
ఆమె ఒక విమల!
ఆమె ఒక జోల!
ఆమె ఒక జ్వాల!
శిల అల కల కళ వల గోల శ్యామల పరిమళ... ఓ మహిళ!
ఊయల కోయిల వెన్నెల విమల జోల జ్వాల... ఓ మహిళ!
ఎందరినో భరిస్తుంది... భూమాత మహిళ!
అందరికీ ఆశ్రయమిస్తుంది... భరతమాత మహిళ!
ప్రతి ఒక్కరికీ జన్మనిస్తుంది... మాతృమూర్తి మహిళ!
ప్రపంచాన్ని నడిపిస్తుంది... పరాశక్తి మహిళ!
ఉత్తరాన నీటినిచ్చు... గంగమ్మ మహిళ!
దక్షిణాది దాహార్తి తీర్చు... గోదారి మహిళ!
పువ్వు కన్నా సున్నితము నీ అనుతాపము!
వజ్రము కన్నా కఠినము నీ కోపము!
నీ ముఖమును తేజస్సు,
దేశానికి ఉషస్సు!
నీ చల్లని మనసు,
లోకానికి అలుసు!