చిరస్మరణీయ చికిత్సకులు
చిరస్మరణీయ చికిత్సకులు
చికిత్సాధీనుల జీవితానికి కవచం అయ్యెను చికిత్సకులు,
నిర్భయంగా ఉండి వ్యాపక రోగానికి అయ్యెను నిరీక్షకులు,
ఎదురించెను సంక్రమించే మహమ్మారి భయానక అవస్థలు,
వైద్యులు యావజ్జీవం అందరికి అయ్యెను జీవన రక్షకులు |౧|
వైద్యశాలలో పరిచారిక పరిచారకులు ఎప్పుడూ అదరణీయం,
వారి ఆయువు ఆరోగ్యం పైన సరైన ధ్యానం చాలా అనివార్యం,
ప్రతి రోగికి సమయోచిత ఔషధం ఇచ్చి చేసెను వ్యాధి నిరోధం,
సముచిత ఉపచారం ద్వారా వ్యాధిగ్రస్త వేదన చేసెను దూరం |౨|
>
రోగుల ఎదురుగా భిషక్కులు తెచ్చుకోలేరు భావావేశం,
హానికర విశ్వమారి తేవచ్ఛును వారికీ భీషణ ప్రమాదం,
కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో చేసెను దుఃఖ నివారణం,
మన చికిత్సకుల వద్ద నేర్చుకోవాలి ధైర్యం గుణపాఠం |3|
మన సామజిక స్వాస్థ్య సేవిక సేవకులు సదా చిరస్మరణీయం,
వారి పుణ్యకార్యం ధర్మకార్యం కొరకు నతం అయ్యెను మస్తకం,
ప్రతి ఒక్కరి జీవితకాలం స్వయంగా ఓ నిస్స్వార్థ త్యాగ పుస్తకం,
కర్తవ్యనిష్ఠ నీతిగల చికిత్సకులు ప్రతి దేశం కోసం అరుదైన కోశం |౪|