దివ్యకాంతుల దీపమాలిక
దివ్యకాంతుల దీపమాలిక
ఆయువు ఆరోగ్యాలు మన అందరికి యేవేళైనా ఉత్కృష్ట ఉత్తమోత్తమ సంపద,
అనంతరము అవిరతంగా ప్రవహించెను సజీవ సంజీవి జ్ఞానసుధల సంపద,
పూర్వజుల ఆశీర్వాదం ప్రతి జీవితానికి జీవంత జీవితానికి అమూల్య సంపద,
ప్రతి జీవంతమైన క్షేత్రము ధర్మరాజ ధనవంతరిదేవుల ఆశీర్వచనాల సంపద,
సద్గుణ సత్సంకల్ప సత్కార్యాలతో సార్థకము అయ్యెను మన ఇహలోక సంపద |౧|
మన ఇహలోకంలో అనుదినము ఒక అరుదైన పర్వదినం,
అందున దీపమాలికతో ఈ ధరణి అయ్యెను దేదీప్యమానం,
దీపాంజలి దీపారాధనలు భక్తిభావానికి సుందర నిదర్శనం,
దివ్యకాంతుల జ్ఞానదీపాల దీప్తి జయదీపానికి సురమ్య సోపానం,
జాజ్వల్యమానం తేజస్సుతో జీవనజ్యోతికి చేసెను శోభాయమానం |౨|