STORYMIRROR

pravalika vadlakonda

Abstract Fantasy Others

4  

pravalika vadlakonda

Abstract Fantasy Others

"దైవ దర్శనం"

"దైవ దర్శనం"

1 min
394

నా మదిలో ఓ ఆలోచన మెదిలింది

 దేవుని చూడాలనే ఆశ కలిగింది

 ఆ దైవం కోసం అన్వేషణ మొదలయ్యింది 

 ఎందరినో ఆరా తీయడం జరిగింది

 అందరూ రాయిలో దేవుడిని చూపించారు

రాయిలో దేవుడిని చూడడానికి నా మనసు అంగీకరించలేదు.

 దేవుడిని వెతికి వెతికి అలసిన నేను నిద్రించాను

 కలలో నాకు అద్భుతం కనిపించింది

 మధుర వాక్యాలు వినిపించాయి

"  వికసించిన  పువ్వులో నేనున్నాను,  వీచేటి గాలిలో నేనున్నాను "

  "మనసుతో చూడు ప్రతి మనిషిలో నేనున్నాను"

" నిర్మలంగా  ఆలోచించు నీలోనే నేనున్నాను"

 ఈ సృష్టి అంతా  నేనే నిండాను

" నేను ఉన్నానని  నువ్వు నమ్మితే, 

 ఆ నమ్మకంలోనే నేనున్నాను."

 కళ్ళు తెరిచిన నాకు, జ్ఞానోదయం అయ్యింది

 దేవుడిని చూడాలనే కోరిక తీరింది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract