స్నేహబంధం
స్నేహబంధం
కలలో కూడా నేను తలచుకునే నా ప్రియ నేస్తమా..
ఇలలో నీ రూపం నా కన్నులను వీడి పోనన్నది
ప్రియతమా..
ఇంతలా నన్ను మాయ చేసింది నీ రూపమా..
కల్మషం లేని నీ మాటలా.. నా ఆనందానికి అర్థం నువ్వయ్యావు , నీ అల్లరికి ఆయువు నేనయ్యాను .నీ పేరు నా పెదాలపై నవ్వయితే
నా మాటలు నీకు పాటలయ్యాయి.
కల్మషం లేని స్నేహంగా మారి , కలతలు లేని బంధంగా నిలిచింది
మన స్నేహం ఒక అద్భుతంలా మారి, శాశ్వతం కావాలని నా అభిలాష .