ధ్వంస రచన
ధ్వంస రచన
మాటల్లో నిజం
చేతల్లో నిజం
అన్నిటా నిజం
అందరు చెప్పేదీ నిజం
మరి అబద్ధం చెప్పేది ఎవ్వరు
భగవద్గీత మీద ప్రమాణం చేసి
అంతా నిజమే చెప్తాను
అని చేసే ప్రమాణాలు
న్యాయ దేవత కళ్ళకు కట్టిన గంతలు
ప్రశ్నించెను న్యాయవాదుల వకాల్తాలు
ఆవు గంట మోగిస్తే
పరుగున వచ్చి ధర్మం చెప్పిన రాజులు
వారు ఏలిన ఈ భారత గడ్డపైన నే
డు న్యాయమంటే నవ్వులాటలు
ఎందుకు
మేథో మథనం తెచ్చిన రాజ్యాంగం ఎవరికోసం
నీకోసం నాకోసం
మనందరికోసం కాదా
మరి ఎందుకీ మౌనం
నిజం చెప్పాలంటే ఎందుకు భయం
ఎన్నాళ్లీ
అశ్వత్థామ హత: కుంజరహ అని సర్దుబాట్లు
న్యాయం కోసం సామాన్యుడు పడే పాట్లు
అన్యాయం చేసే ధ్వంస రచనలకు
పీఠికలు రాస్తూ న్యాయస్థానాలు చేస్తున్న మౌన పోరాటాలు